స్కూటీపై విరాట్‌, అనుష్క చ‌క్క‌ర్లు... వీడియో ఇదిగో

20-08-2022 Sat 18:58
  • ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ
  • ఢిల్లీలో భార్య అనుష్క‌తో క‌లిసి స్కూటీపై రోడ్డు మీద‌కు వ‌చ్చిన వైనం
  • హెల్మెట్లు పెట్టుకున్నా గుర్తించిన కొంద‌రు వ్య‌క్తులు
  • గుంత‌ల‌ను త‌ప్పిస్తూ స్కూటీని ముందుకు దూకించిన విరాట్‌
virat and his wife anushka spotted on scooty in delhi
టీమిండియా జ‌ట్టు ప్ర‌స్తుతం జింబాబ్వే టూర్‌లో ఉండ‌గా... జ‌ట్టులో స్టార్ బ్యాట‌ర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త‌న సొంత న‌గ‌రం ఢిల్లీలో భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి అత‌డు న‌గ‌ర వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అది కూడా స్కూటీపై విరుష్క దంప‌తులు ఢిల్లీని చుట్టేస్తున్న వీడియో ఒక‌టి శ‌నివారం సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి వైర‌ల్‌గా మారిపోయింది.

బ్లాక్ ప్యాంట్‌, గ్రీన్ క‌ల‌ర్ ఫుల్ హ్యాండ్స్ టీష‌ర్ట్‌తో ముందు కూర్చున్న కోహ్లీ స్కూటీని న‌డుపుతుండ‌గా... బ్లాక్ క‌ల‌ర్ ట్రాక్ సూట్‌లో క‌నిపించిన అనుష్క భ‌ర్త‌ను అతుక్కుని మ‌రీ స్కూటీ రైడ్‌ను ఎంజాయ్ చేసింది. 1.6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను త‌ప్పించుకుంటూ కోహ్లీ చాలా జాగ్ర‌త్త‌గా స్కూటీని న‌డిపాడు.

 ఇద్ద‌రూ హెల్మెట్లు పెట్టుకుని ఉండ‌టంతో చాలా మంది వారిని గుర్తించ‌లేదు. అయితే హెల్మెట్లు ఉన్నా... విరుష్క దంప‌తుల‌ను గుర్తించిన కొంద‌రు వారిని వెంబ‌డిస్తూ వీడియోలు తీస్తుండ‌గా... ఇదేం ప‌ద్ద‌తి అంటూ వారిని అనుష్క వారించింది. స్కూటీపై రోడ్డు మీదకు వచ్చిన విరుష్క దంపతులు తమ వెంట గొడుగు కూడా తీసుకురావడం గమనార్హం.