Congress: తండ్రి రాజీవ్‌కు నివాళి అర్పించిన రాహుల్, ప్రియాంక

rahul gandhi with his sister and brother in law pays tributes to his father rajiv gandhi
  • నేడు రాజీవ్ గాంధీ జ‌యంతి
  • వీర్ భూమికి వెళ్లిన రాహుల్‌, ప్రియాంక, వాద్రా
  • తండ్రి జ్ఞాప‌కాల్లో మునిగిపోయిన రాహుల్ గాంధీ
భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శ‌నివారం దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘ‌నంగా నివాళి అర్పించాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స‌మాధి వీర్ భూమికి ఆయ‌న కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా, అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాలు శ‌నివారం ఉద‌యం వెళ్లారు. ముగ్గురు క‌లిసి రాజీవ్‌కు నివాళి అర్పించారు. 

అనంత‌రం రాజీవ్ స‌మాధి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన రాహుల్ గాంధీ... స‌మాధి చెంత‌నే కూర్చుని తండ్రి జ్ఞాప‌కాల్లో మునిగిపోయారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ తీవ్ర విచారంలో కూరుకుపోయారు. త‌న ప‌క్క‌నే చాలా మంది నేత‌లు ఉన్నా... రాహుల్ మాత్రం ముభావంగా క‌నిపించారు.
Congress
Rahul Gandhi
Priyanka Gandhi
Veer Bhoomi
Robert Vadra

More Telugu News