PV Sindhu: రోజా ఇంటిలో పీవీ సింధు... మంత్రితో క‌లిసి లంచ్ చేసిన ష‌ట్ల‌ర్‌

pv sindhu and indian hockey player Rajani Etimarpu visits apminister roja house
  • కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి నెగ్గిన పీవీ సింధు
  • కుటుంబంతో కలిసి మంత్రి రోజా ఇంటికి వచ్చిన స్టార్ షట్లర్
  • రోజాను కలిసిన భారత హాకీ జట్టు సభ్యురాలు రజిని
ఇటీవ‌లే ముగిసిన కామ‌న్వెల్త్ గేమ్స్‌లో మ‌హిళ‌ల బ్యాడ్మింట‌న్‌లో బంగారు ప‌త‌కంతో మెరిసిన తెలుగు నేల‌కు చెందిన స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు శ‌నివారం ఏపీ క్రీడా శాఖ మంత్రి రోజా ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రులతో పాటు త‌న సోద‌రిని కూడా వెంట‌బెట్టుకుని రోజా ఇంటికి వెళ్లిన సింధు మంత్రి కుటుంబస‌భ్యుల‌తో క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను రోజా త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు. 

'బంగారు పతకం సాధించిన మన 'బంగారం' సింధు తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది.  నా కుటుంబంతో కలసి సింధు కుటుంబసభ్యులతో లంచ్ చేయడం జరిగింది' అంటూ రోజా సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే... భారత హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఏపీ క్రీడాకారిణి రజిని కూడా శనివారం మంత్రి రోజాను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా.. రజినిని ఘనంగా సన్మానించారు. మంత్రి రోజా, పీవీ సింధులతో కలిసి రజిని కూడా రోజా ఇంటిలోనే భోజనం చేశారు.
PV Sindhu
Roja
Andhra Pradesh
Rajani Etimarpu

More Telugu News