'గాడ్ ఫాదర్' టీజర్ రెడీ .. రేపు సాయంత్రం రిలీజ్!

20-08-2022 Sat 17:28
  • 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి 
  • ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ ఖాన్ 
  • కీలకమైన పాత్రను పోషించిన నయన్ 
  • సంగీతాన్ని అందించిన తమన్ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల
God Father movie upadate
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. ఆర్ బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి వస్తున్న పోస్టర్స్ మెగా అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితమే అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. 

ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ కనిపించనుండగా, కీలకమైన పాత్రను నయనతార పోషించింది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టయినర్ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సారి దసరాకి థియేటర్స్ దగ్గర సందడి ఒక రేంజ్ లో ఉండేట్టుగానే కనిపిస్తోంది మరి.