శేఖర్ కమ్ములతో దుల్కర్ సల్మాన్ మూవీ!

20-08-2022 Sat 11:47
  • మలయాళ స్టార్ హీరోగా దుల్కర్ 
  • తెలుగు సినిమాల పట్ల ఆసక్తి
  • హిట్ తెచ్చిపెట్టిన 'సీతా రామం'
  • శేఖర్ కమ్ముల కథకు గ్రీన్ సిగ్నల్
Dulquer in Sekhar kammula movie
మలయాళంలో వరుస సినిమాలతో దుల్కర్ ఫుల్ బిజీ. అయినా ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. ఇటీవల ఆయన చేసిన 'సీతా రామం' సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై తెలుగులోను వరుస సినిమాలు చేస్తానని దుల్కర్ చెప్పాడు.

అన్నట్టుగానే ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఆయనకి ఒక కథను చెప్పడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. 'లవ్ స్టోరీ' హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి ఇంతవరకూ మరో సినిమా లేదు. ధనుశ్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడనే టాక్ మాత్రం బయటికి వచ్చింది. 

ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ధనుశ్, తెలుగులో 'సార్' అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను రిలీజ్ చేయనున్నారు. ఆయనతో సినిమాకి ఇంకా సమయం ఉండటం వల్లనే, దుల్కర్ ను శేఖర్ కమ్ముల ఒప్పించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.