మెగాస్టార్ కీ .. రాజమౌళికి థ్యాంక్స్: మణిరత్నం

20-08-2022 Sat 11:12
  • మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్'
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • రెండు భాగాలుగా రానున్న సినిమా
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల
Ponniyin Selven Second Singel Released
సౌత్ ఇండియాలోని దర్శకులలో మణిరత్నం స్థానం ప్రత్యేకం. ఆయన టేకింగ్ ను ఇష్టపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దర్శకత్వం వైపు వచ్చిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్' సిద్ధమైంది. తమిళ .. తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ వేదికపై మణిరత్నం మాట్లాడుతూ .. "ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా జానపదాలను చేసి సక్సెస్ ను సాధించవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారు. ఆయన తెరకెక్కించిన 'బాహుబలి' మాదిరిగానే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. 

ఇక ఈ వేదిక ద్వారా చిరంజీవిగారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాననేది ఆ తరువాత మీకు తెలుస్తుంది" అన్నారు. 'రాజ రాజ చోళ'కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో,  విక్రమ్ .. కార్తి .. జయం రవి .. శరత్ కుమార్ .. ఐశ్వర్య రాయ్ .. త్రిష .. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు.