ఇకపై ఇదే నా స్టైల్: పూరి

20-08-2022 Sat 10:30
  • పూరి తాజా చిత్రంగా రూపొందిన 'లైగర్'
  • ఆయన కెరియర్లో ఎక్కువ సమయం తీసుకున్న సినిమా
  • ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతానంటూ వ్యాఖ్య 
  • ఈ నెల 25వ తేదీన విడుదలవుతున్న సినిమా  
Puri Interview
రైటర్ గా.. దర్శకుడిగా పూరి జగన్నాథ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన టేకింగ్ ఒక ఎత్తయితే ... ఆయన డైలాగ్స్ ఒక ఎత్తు. కథాకథనాలు .. సంభాషణలు రాసుకోవడం, సెట్స్ పైకి తీసుకుని వెళ్లడం .. థియేటర్స్ కి తీసుకురావడం చాలా ఫాస్టుగా జరిగిపోతుంటాయి. టాలీవుడ్ లో అంత ఫాస్టుగా ప్రాజెక్టులను పూర్తిచేసే స్టార్ డైరెక్టర్ మరొకరు కనిపించరు. 

కోవిడ్ కారణంగా .. కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా మారడం వలన .. పాన్ ఇండియా రిలీజ్ అనుకోవడం వలన 'లైగర్' సినిమా పూర్తికావడానికి ఆలస్యమైందిగానీ, ఈ సమయంలో మూడు సినిమాలు చేయగల సమర్థుడు ఆయన. ఈ సినిమా తరువాత పూరి మళ్లీ అంతకుముందులా చెలరేగిపోతాడనుకోవడం సహజం. కానీ అలా జరగదని తాజా ఇంటర్వ్యూలో పూరి చెప్పాడు. 

ఇంతకుముందులా తన నుంచి క్విక్ ప్రాజెక్టులు ఉండవని పూరి అన్నాడు. ప్రతి ప్రాజెక్టుకి కొంత సమయం తీసుకోవడం జరుగుతుందనీ, ఆ తరువాతనే అది సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. తెలుగు సినిమాలకి నార్త్ లో మంచి ఆదరణ లభిస్తూ ఉండటం .. పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడటం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.