finland: ప్రతిపక్షాల డిమాండ్ మేరకు డ్రగ్ టెస్టు చేయించుకున్న ఫిన్లాండ్ ప్రధాని

Finnish PM Sanna Marin undergoes drug test after party video sparks row
  • స్నేహితులతో కలిసి పార్టీలో ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో  వైరల్
  • ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రతిపక్షాల ఆగ్రహం
  • డ్రగ్ టెస్టు ఫలితం వారంలో వస్తుందని వెల్లడించిన సనా మారిన్
స్నేహితులతో కలిసి ఓ పార్టీలో తాను డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవడంతో విమర్శలు ఎదుర్కొంటున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. తానెప్పుడూ మాదక ద్రవ్యాలు తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. 

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన 36 ఏళ్ల మారిన్ శనివారం రాత్రి ఫిన్లాండ్ కు చెందిన పలువురు ప్రముఖులు, ఆర్టిస్టులతో కలిసి పార్టీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు. 

గతంలో కూడా ఆమె పలు మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజా వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. 

తనపై వస్తున్న ఆరోపణలను మారిన్ ఖండిచారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. ‘ఈ మధ్య నేను డ్రగ్స్ ఉపయోగించిన ప్రాంతాల్లో ఉన్నానని, లేదా నేను నేనే డ్రగ్స్ వాడానని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నేను చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నా. డ్రగ్ టెస్టు చేయించుకోవాలని డిమాండ్ చేయడం అన్యాయంగా భావిస్తున్నప్పటికీ, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నేను ఈ రోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నా. దాని ఫలితాలు ఒక వారంలో వస్తాయి’ అని సనా పేర్కొన్నారు.
finland
Prime Minister
sanna marin
party
drug test
Viral Videos

More Telugu News