తనను తానే పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించిన టీవీ నటి కనిష్కా సోని

20-08-2022 Sat 07:01
  • ‘దియా ఔర్ బాతి హమ్’ టీవీ షోతో పాప్యులర్ అయిన కనిష్కా సోనీ
  • నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నటి
  • తన జీవితంలో మాటమీద నిలబడే ఒక్క మగాడిని కూడా చూడలేదన్న కనిష్క
 Women dont need men for sex Kanishka Soni
విజ్ఞానం, సాంకేతికత ఎంతో పురోగతి సాధించాయని, శృంగారానికి ఇక పురుషుడితో పనిలేదని ప్రముఖ టీవీ నటి కనిష్కా సోనీ చెప్పుకొచ్చింది. ‘దియా ఔర్ బాతి హమ్’ టీవీ షోతో సుపరిచితమైన కనిష్క కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఇటీవల ఆమె నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. తనను తానే పెళ్లి చేసుకున్నట్టు చెబుతూ అభిమానులకు షాకిచ్చింది. 

ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. అయితే, తన జీవితంలో మాటమీద నిలబడే ఒక్క పురుషుడు కూడా కనిపించలేదని, అందుకనే పురుషుడి తోడు లేకుండానే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నానని వివరించింది. 

తన అవసరాలను తానే తీర్చుకోగలనని, కలలను నెరవేర్చుకోగలనని చెప్పింది. వివాహితులైన మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరనే తాను చెబుతానంది. ‘మహబలి హనుమాన్’ వంటి షోలలో దేవత పాత్ర పోషించినా రాని గుర్తింపు ఇప్పుడు లభిస్తోందని కనిష్క సంతోషం వ్యక్తం చేసింది.