జీ20 సమావేశాల నుంచి పుతిన్ ను నిషేధించండి: రిషి సునాక్

19-08-2022 Fri 20:52
  • బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్
  • ఉక్రెయిన్ పై పుతిన్ అక్రమంగా యుద్ధం చేస్తున్నారని విమర్శ
  • అలాంటి వ్యక్తితో కలిసి సమావేశాల్లో పాల్గొనడం సరికాదని వ్యాఖ్య
Boycott Putin from G20 says Rishi Sunak
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతీయ సంతతి నేత రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అనుమతించకూడదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ పై పుతిన్ అక్రమంగా యుద్ధం చేస్తున్నారని... యుద్ధాన్ని ఆపేంత వరకు పుతిన్ పై నిషేధాన్ని కొనసాగించాలని వ్యాఖ్యానించారు. 

రష్యా చేస్తున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని... ఏమీ తెలియని పసి పిల్లలు మంచం మీదే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తితో కలిసి సమావేశాల్లో పాల్గొనడం సరికాదని అన్నారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో బాలిలో జీ20 సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా హాజరు కాబోతున్నారు.