నన్ను చాలా మంది కమిట్మెంట్ అడిగారు: టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ

19-08-2022 Fri 20:29
  • ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది పచ్చి నిజమన్న తేజస్వి 
  • తాను చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని వ్యాఖ్య 
  • ఈవెంట్లకు వెళ్లినప్పుడు చుట్టూ చేరి వేధించేవారని వెల్లడి  
Many people asked me for commitment says actress Tejashwi Madivada
సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు నిర్భయంగా మాట్లాడారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. తాజాగా ఇదే అంశంపై బిగ్ బాస్ ఫేం, సినీ నటి తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. 

సినీ పరిశ్రమలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజమని చెప్పింది. తనను కూడా ఎంతో మంది కమిట్మెంట్ అడిగారని తెలిపింది. ప్రతి రంగంలో ఇలాంటివి ఉంటాయని... వారికి లొంగిపోకుండా, ధైర్యంగా ఉండాలని చెప్పింది. అలాంటి వాళ్లకు లొంగిపోయి ఆ తర్వాత మోసపోయాం అని చెప్పడం సరైంది కాదని తెలిపింది. తాను సినిమాలు చేస్తూనే ఈవెంట్లకు వెళ్లేదాన్నని... ఈవెంట్లకు వెళ్లినప్పుడు జనాలు ఫుల్లుగా తాగి తన చుట్టూ చేరి వేధించేవారని... వారి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడేదాన్నని చెప్పింది.