అతను నన్నే కాదు.. ఇతర మహిళలను కూడా కొట్టేవాడు: సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ

19-08-2022 Fri 19:41
  • ఇప్పటి వరకు చాలా మందితో డేటింగ్ చేసిన సల్మాన్
  • సల్మాన్ గురించి మీకు తెలియదన్న సోమీ అలీ
  • అతన్ని కీర్తించాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
Somy Ali sensational comments on Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 50 ఏళ్ల వయసు దాటినా ఇంకా బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. ఇంత వరకు పెళ్లి ఆలోచనే లేకుండా గడిపేశాడు. అయితే... కెరీర్ ప్రారంభం నుంచి సల్మాన్ నడిపిన ప్రేమాయణాల చిట్టా తీస్తే చాలా పెద్దదిగానే ఉంటుంది. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ వంటి బ్యూటీలు ఆయన మాజీలే. సల్మాన్ డేటింగ్ చేసిన వారిలో సినీ నటి సోమీ అలీ కూడా ఉంది. తాజాగా ఆమె మాట్లాడుతూ సల్మాన్ పై విమర్శలు గుప్పించింది. తనతో సహా ఇతర మహిళలను సల్మాన్ కొట్టేవాడని ఆమె తెలిపింది. 

అతని గురించి మీకు తెలియదని... అతన్ని గొప్పగా కీర్తించడాన్ని మానేయాలని చెప్పింది. సల్మాన్ ఖాన్, సోమీ అలీ కలిసి ఓ చిత్రంలో నటించారు. అయితే ఏవో కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమలో మునిగారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇంత కాలం తర్వాత సల్మాన్ పై సోమీ అలీ విమర్శలు గుప్పించడం గమనార్హం. మరోవైపు ఐశ్వర్య రాయ్ ని కూడా సల్మాన్ కొట్టాడనే ప్రచారం బాలీవుడ్ లో ఉందనేది గమనించదగ్గ విషయం. పాకిస్థాన్ కు చెందిన సోమీ అలీ ప్రస్తుతం అమెరికాలో ఒక ఎన్జీవోను నిర్వహిస్తోంది.