శ‌బ‌రిమ‌ల‌ అయ్య‌ప్ప సేవ‌లో వైసీపీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ... ఫొటోలు ఇవిగో

19-08-2022 Fri 19:07
  • ఏళ్ల త‌ర‌బ‌డి అయ్య‌ప్ప మాల‌లు వేస్తున్న పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి
  • ఈ ఏడాది వారితో క‌లిసి దీక్ష‌కు దిగిన కేఆర్‌జే భ‌ర‌త్‌
  • ముగ్గురూ క‌లిసి అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్న వైనం
ysrcp leaders offers prayers to shabarimala ayyappa
వైసీపీ కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు పెద్దిరెడ్డి వెంక‌ట మిధున్ రెడ్డిల‌తో క‌లిసి   చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జీ, ఎమ్మెల్సీ కేఆర్జే భ‌ర‌త్ శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లారు. అయ్య‌ప్ప దీక్ష‌కు దిగిన భ‌ర‌త్‌... ఏళ్ల త‌ర‌బ‌డి అయ్య‌ప్ప మాల‌లు వేస్తున్న రామ‌చంద్రారెడ్డి, మిధున్ రెడ్డిల‌తో క‌లిసి గురువారం శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లారు.

శుక్ర‌వారం కృష్ణాష్టమి ప‌ర్వ‌దినాన ముగ్గురు నేత‌లు అయ్య‌ప్ప సేవ‌లో పాలుపంచుకున్నారు. ఇరుముడుల‌ను త‌ల‌పై పెట్టుకుని సాగుతున్న త‌మ ఫొటోల‌ను భ‌ర‌త్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. శుక్ర‌వార‌మే తామంతా అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్న‌ట్లుగా ఆయ‌న తెలిపారు. జగన్ కేబినెట్ లో పెద్దిరెడ్డి మంత్రిగా కొనసాగుతుండగా.. మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.