రేపు క‌డ‌ప జిల్లాకు జ‌నసేనాని... సిద్ధవ‌టంలో ర‌చ్చ‌బండ నిర్వ‌హించ‌నున్న ప‌వ‌న్‌

19-08-2022 Fri 18:16
  • ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు జ‌న‌సేన ఆస‌రా
  • బాధిత కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున సాయం
  • చెక్కుల‌ను స్వ‌యంగా అంద‌జేయ‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌
janasena chief pawan kalyan tour in kadapa district tomorrow
ప్ర‌ముఖ సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఏపీలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచే ఉద్దేశంతో కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రేపు (శ‌నివారం) ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ పేరిట రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. ర‌చ్చ‌బండ‌లోనే ఆయ‌న ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున స‌హాయం అందించ‌నున్నారు. జిల్లా ప‌రిధిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌న్నింటికీ ప‌వ‌న్ ఈ సాయాన్ని చేర‌వేయ‌నున్నారు.