Smart phone: ర్యామ్ బూస్టింగ్ తో వివో వై22ఎస్.. స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఇవీ

Vivo Y22S with RAM boosting These are features of the smartphone
  • 50 మెగాపిక్సెల్ కెమెరా.. 6.55 అంగుళాల డిస్ ప్లేతో ఫోన్
  • 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. యూఎస్ బీ టైప్ సీ ఆధారిత చార్జింగ్ పోర్టు
  • త్వరలోనే విడుదల చేయనున్నట్టు పేర్కొన్న వివో సంస్థ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తమ బడ్జెట్ శ్రేణిలో మరో కీలకమైన ఫోన్ ‘వివో వై22 ఎస్’ మోడల్ ను ఆవిష్కరించింది. తక్కువ ధరలో మంచి అనుభూతిని ఇచ్చేలా ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్టు తమ వెబ్ సైట్లో ప్రకటించింది. అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఉత్తమమైన ప్రాసెసర్ కు ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీ వల్ల.. యాక్టివ్ గా ఉన్న యాప్ ల మధ్య వేగంగా మారిపోవచ్చని.. ఎలాంటి ల్యాగింగ్ ఉండబోదని పేర్కొంది. త్వరలోనే భారత మార్కెట్లో ఈ ఫోన్ విక్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించింది.

వివో వై 22 ఎస్ ప్రత్యేకతలు ఇవీ..
  • వివో సంస్థ తమ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు.
  • 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ భారీ డిస్ప్లేతో.. వాటర్ డ్రాప్ ఆకారంలోని ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
  • వెనుక వైపున 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
  • గరిష్ఠంగా 128 జీబీ మెమరీ వరకు మోడళ్లు అందుబాటులో ఉంటాయి. ఎస్ డీ కార్డు సాయంతో 2 టీబీ వరకు మెమరీని పెంచుకోవచ్చు.
  • 8 జీబీ ర్యామ్ నుంచి 12 జీబీ ర్యామ్ వరకు వివిధ మోడళ్లు అందుబాటులో ఉంటాయి. ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీతో ఫోన్ లోని ఇన్ బిల్ట్ మెమరీలో కొంత భాగాన్ని అవసరమైనప్పుడు ర్యామ్ లా ఉపయోగించుకుని వేగంగా పనిచేస్తుంది.
  • 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. యూఎస్ బీ టైప్ సీ ఆధారిత చార్జింగ్ పోర్టు ఇచ్చారు.
  • వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, ఎఫ్ ఎం రేడియో, ఓటీజీ వంటి సదుపాయాలు, ఇతర అత్యవసర సెన్సర్లు అన్నింటినీ ఫోన్ లో పొందుపరిచారు.
  • ఫోన్ అంచుల వైపు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుందని వివో సంస్థ తెలిపింది.
  • ఈ ఫోన్ ను ఆవిష్కరించిన కంపెనీ.. దాని విడుదల తేదీ, ధర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
  • ప్రస్తుతం వివో వీ 25 సిరీస్ ఫోన్ ను విడుదల చేయనున్న నేపథ్యంలో.. కొన్ని రోజుల్లోనే వివో వై 22 ఎస్ మోడల్ ను విడుదల చేయవచ్చని.. ధరలు రూ.12 వేల నుంచి ప్రారంభం కావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Smart phone
Tech-News
India
International
Vivo y22s
Y22s specifications

More Telugu News