కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరి మృతి

19-08-2022 Fri 15:31
  • ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు
  • కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సందర్భంలో ప్రమాదం
  • తొమ్మిది మందికి గాయాలు.. ఆసుపత్రులలో చికిత్స 
Blast in Kakinada sugar factory
కాకినాడ రూరల్ పరిధిలోని వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. గోదాంలో పంచదార బస్తాలను లోడు చేస్తుండగా కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సందర్భంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు.

మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు (45)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. వీరిలో పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన వెంకట రమణ (29) పరిస్థితి విషమంగా ఉంది. ఈయనకు కాకినాడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు కాకికాడలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.