శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

  • కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
  • సీజేఐకి స్వాగతం పలికిన వైవీ సుబ్బారెడ్డి
  • శ్రీవారిని దర్శించుకున్న యడియూరప్ప, బొమ్మై
CJI NV Ramana offers prayers to Tirumal Venkateswara Swamy

తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. 

అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జన్ భూయాన్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప కూడా వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీరందరికీ టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

More Telugu News