మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్

19-08-2022 Fri 14:13
  • లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడనున్నట్టు ప్రకటన
  • మళ్లీ క్రికెట్ లో భాగం అవుతుండడం పట్ల భావోద్వేగం
  • సెప్టెంబర్ 17 నుంచి నాలుగు జట్ల మధ్య 15 మ్యాచ్ లు
Former India opener Gautam Gambhir to play in 2nd edition of Legends League Cricket
లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భారత జట్టు మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి బ్యాట్ పట్టనున్నాడు. సెప్టెంబర్ 17న జరిగే మ్యాచ్ లకు తాను ఆడనున్నట్టు గంభీర్ ప్రకటించాడు. 

‘‘సెప్టెంబర్ 17 నుంచి జరిగే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో నేను కూడా పాల్గొంటున్నానని ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నాను. మరోసారి క్రికెట్ మైదానంలో అడుగు పెడుతుండడం పట్ల ఎంతో భావోద్వేగంగా ఉంది. ప్రపంచ క్రికెట్ శోభలో మరోసారి భాగం అవుతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని గంభీర్ ప్రకటించాడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ ఎడిషన్ లో భాగంగా మొత్తం నాలుగు జట్ల మధ్య 15 మ్యాచ్ లు జరుగుతాయి. మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న జరిగే ప్రత్యేక మ్యాచ్ లో, భారత్ కు చెందిన మహారాజాస్ జట్టుకు బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.