అమితాబ్ ని కలిసిన చందూ మొండేటి

19-08-2022 Fri 13:36
  • ఘన విజయం సాధించిన 'కార్తికేయ 2'
  • ఉత్తరాదిన వెయ్యికి పైగా స్క్రీన్లలో ప్రదర్శితం 
  • అమితాబ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయన్న చందు మొండేటి
Chandu Mondeti meets Amitabh Bachchan
నిఖిల్, అనుమపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చిన 'కార్తికేయ2' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. హిందీలో సైతం ప్రేక్షకాదరణను పొందింది. ఏ మాత్రం హడావుడి, సందడి లేకుండానే విడుదలైన ఈ సినిమా హిట్ కావడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నార్త్ లో తొలుత 50 కన్నా తక్కువ స్క్రీన్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే... ప్రస్తుతం వెయ్యికి పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో, సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో వుంది.

మరోవైపు, ఈ చిత్ర దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు. ఆయనను కలిసిన పిక్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చందు మొండేటి స్పందిస్తూ... అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు 'కార్తికేయ 3' కూడా రాబోతోందనే విషయంపై చిత్ర దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.