'బింబిసార 2' కథపై మొదలైన కసరత్తు!

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'బింబిసార'
  • ఇంతవరకూ 54 కోట్ల వసూళ్లు 
  • ఇతర భాషల్లో రిలీజ్ కి సన్నాహాలు 
  • వచ్చే వేసవిలో సెట్స్ పైకి సెకండ్ పార్టు 
  • 2024 ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన  
Bimbisara 2 movie update

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా దర్శకుడు వశిష్ఠ 'బింబిసార' సినిమాను రూపొందించాడు. తన సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇంతవరకూ 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమా సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, తప్పకుండా సీక్వెల్ చేస్తామనే క్లారిటీ ఇచ్చేశాడు. సెకండ్ పార్టు మరింత గ్రాండ్ గా ఉంటుందని బలంగా చెప్పాడు. ఇక ఇప్పుడు వశిష్ఠ అందుకు సంబంధించిన కథపైన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ ఏడాది చివరినాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని అంటున్నారు. 

ఆ తరువాత పనులను చక్కబెట్టి, వచ్చే వేసవిలో రెగ్యులర్ షూటింగుకు వెళ్లనున్నారని చెబుతున్నారు. 2024 ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో అతిథి పాత్రలో ఎన్టీఆర్ మెరిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందిస్తారని అంటున్నారు.

More Telugu News