మళ్లీ పట్టాలెక్కుతున్న 'ఇండియన్ 2'

19-08-2022 Fri 10:06
  • గతంలో సంచలనం సృష్టించిన 'ఇండియన్'
  • ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'ఇండియన్ 2'
  • కొంతకాలంగా ఆగిపోయిన షూటింగ్
  • ఈ నెల 25 నుంచి మళ్లీ షూటింగ్ మొదలు   
Indian Movie Update
కమలహాసన్ కథానాయకుడిగా గతంలో శంకర్ నిర్మించిన 'ఇండియన్' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. లుక్ పరంగా .. నటన పరంగా కమల్ చేసిన చిత్రాలలో 'ఇండియన్' సినిమాకి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది. 

అలాంటి సినిమాకి సీక్వెల్ గా 'ఇండియన్ 2' ప్రాజెక్టును శంకర్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. కొంతవరకూ చిత్రీకరణ జరిగిన తరువాత కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. దాంతో చరణ్ ప్రాజెక్టును శంకర్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా ఎనిమిదికి పైగా షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. 

ఈ సమయంలోనే 'ఇండియన్ 2' సినిమాకి సంబంధించిన సమస్య తొలగిపోయింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 25 నుంచి ప్లాన్ చేసినట్టుగా సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడు. కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ఒక కీలకమైన పాత్రలో మెరవనుంది.