Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ ను విదేశీ మహిళతో పోల్చుతూ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

The way girls change boyfriends BJP leader sexist jibe at Nitish Kumar earns Congress ire
  • విదేశాల్లో మహిళలు కోరుకున్నప్పుడు బోయ్ ఫ్రెండ్స్ ను మారుస్తారన్న విజయ వర్గీయ
  • బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అంతేనని వ్యాఖ్య
  • ఆయన ఎప్పుడు ఎవరి చేయి పట్టుకుంటారో, వదిలేస్తారో తెలియదంటూ కామెంట్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యవహార తీరుపై బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ను విదేశీ మహిళతో పోల్చారు. విదేశీ మహిళలు మగ స్నేహితులను మార్చినట్టుగానే నితీశ్ వ్యవహారశైలి ఉందన్నారు. బీజేపీతో భాగస్వామ్యానికి ఇటీవలే నితీశ్ గుడ్ బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాఘట్ బంధన్ తో కలసిపోవడం తెలిసిందే. నితీశ్ కుమార్ కు ఇలా భాగస్వాములను మార్చడం బీహార్ లో అలవాటుగా వస్తోంది.

బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై మీడియా ముఖంగా విజయవర్గీయ మాట్లాడారు. ‘‘నేను విదేశాల్లో కొన్ని రోజుల పాటు ఉన్నప్పుడు.. ఇక్కడ మహిళలు తమ బోయ్ ఫ్రెండ్స్ ను ఎప్పుడైనా మార్చుకుంటారని ఒకరు నాతో చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా అంతే. ఆయన ఎవరి చేయి పట్టుకుంటారో, ఎవరిని వదిలేస్తారో మనకు ఎప్పటికీ అర్థం కాదు’’ అని విజయవర్గీయ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ.. మహిళల పట్ల వారికున్న గౌరవానికి ఇది నిదర్శనమంటూ ట్విట్టర్లో విమర్శించారు.
Nitish Kumar
sexist remarks
BJP leader
comments

More Telugu News