Andhra Pradesh: ఏడు శాతానికిపైగా వడ్డీతో మరో రూ. 1000 కోట్లు అప్పు తీసుకున్న ఏపీ

Andhrapradesh Govt taken another Rs1000 cr loan from RBI
  • 7.72 శాతం వడ్డీతో రూ. 500 కోట్ల రుణం
  • 7.74 శాతం వడ్డీతో మరో 500 కోట్ల అప్పు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 34,980 కోట్ల రుణం 
 భారతీయ రిజర్వు బ్యాంకు నిన్న నిర్వహించిన బహిరంగ మార్కెట్ వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో రూ. 500 కోట్లను 13 ఏళ్ల కాలపరిమితిలో 7.72 శాతం వడ్డీ చెల్లించేలా తీసుకోగా, మిగతా రూ. 500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.74 శాతం వడ్డీకి తీసుకుంది.

ఈ రుణంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 34,980 కోట్ల రుణాలు తీసుకున్నట్టు అయింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ. 43,803 కోట్ల బహిరంగ రుణాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయితే, నాలుగున్నర నెలల్లోనే ఏకంగా రూ. 34 వేల కోట్లకుపైగా ఏపీ రుణం పొందడం గమనార్హం.
Andhra Pradesh
RBI
Debit

More Telugu News