లైగర్ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఏడు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు

18-08-2022 Thu 19:46
  • విజయ్ దేవరకొండ హీరోగా లైగర్
  • అనన్యా పాండే కథానాయిక
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టయినర్
  • సినిమా రన్ టైమ్ 140.20 నిమిషాలు
Censor Board suggests seven cuts to Liger
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అదే సమయంలో ఏడు కట్స్ ను కూడా సూచించింది. లైగర్ చిత్రం రన్ టైమ్ 140.20 నిమిషాలు కాగా, సెన్సార్ బోర్డు సభ్యులు పలు అభ్యంతరాలు చెప్పారు. 

'ఎఫ్' తో మొదలయ్యే ఓ పదాన్ని అనేకచోట్ల ఉపయోగించారని, ఆ పదం వచ్చిన చోట మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. లైగర్ లో నటీనటులు కొన్నిచోట్ల ఎదుటివారిపై ఆవేశం వచ్చినప్పుడు ఉపయోగించిన సైగలు అభ్యంతరకంగా ఉన్నాయని, వాటిని బ్లర్ చేయాలని సూచించింది. అంతేకాదు, చేతులతో చేసే మరో సంజ్ఞ కూడా అసభ్యకరంగా ఉందని, దాన్ని తొలగించాలని స్పష్టం చేసింది.
.