Team India: తొలివన్డేలో జింబాబ్వేపై అలవోకగా గెలిచిన టీమిండియా

Team India registers very easy win against Zimbabwe
  • టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 40.3 ఓవర్లలో 189 రన్స్ కు ఆలౌటైన జింబాబ్వే
  • 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
  • అర్ధసెంచరీలతో అజేయంగా నిలిచిన ఓపెనర్లు
జింబాబ్వేతో వన్డే సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఇవాళ జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భారత్... లక్ష్యఛేదనలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. 

ఓపెనర్లు శిఖర్ ధావన్ 81, శుభ్ మాన్ గిల్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు. 113 బంతులెదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు కొట్టగా, యువ ఆటగాడు గిల్ 72 బంతులాడి 10 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని జింబాబ్వే బౌలర్లు టీమిండియా ఓపెనింగ్ జోడీ ముందు తేలిపోయారు. 

ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.
Team India
Win
Zimbabwe
1st ODI
Harare

More Telugu News