తొలి వన్డే.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలుతున్న జింబాబ్వే

18-08-2022 Thu 15:05
  • హరారేలో జరుగుతున్న తొలి వన్డే
  • 107 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
  • 3 వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్
India Vs Zimbabwe score card
హరారేలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. టాస్ గెలిచిన ఇండియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుందనే అంచనాలతో ఫీల్డింగ్ తీసుకుంటున్నట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. రాహుల్ చెప్పినట్టుగానే బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. 

మన బౌలర్ల డెబ్బకు జింబాబ్వే 27 ఓవర్లలో 107 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రేగిస్ చకబ్వా అత్యధికంగా 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నలుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, ప్రసిధ్ కృష్ణ 2, సిరాజ్, అక్సర్ పటేల్ చెరొక వికెట్ తీశారు.