జింబాబ్వేతో తొలి వన్డే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

18-08-2022 Thu 13:01
  • జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం
  • హరారేలో జరుగుతున్న తొలి వన్డే
  • తొలి ఓవర్లో 6 పరుగులు సాధించిన జింబాబ్వే
India choose to field in 1st ODI against Zimbabwe
భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమయింది. హరారేలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉందని, అందుకే బౌలింగ్ కు మొగ్గుచూపినట్టు రాహుల్ తెలిపాడు. 

మరోవైపు జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా మరుమని, ఇన్నోసెంట్ కైయా బరిలోకి దిగారు. తొలి ఓవర్ ను దీపక్ చాహర్ వేశాడు. తొలి ఓవర్ లో 6 పరుగులు వచ్చాయి. కైయా ఒక పరుగు చేయగా, మిగిలిన 5 రన్స్ లెగ్ బైస్ రూపంలో వచ్చాయి. 

భారత తుది జట్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్, అక్సర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.