ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి కొందరు సంకోచిస్తున్నారు: సన్నీ లియోన్

18-08-2022 Thu 11:55
  • బాలీవుడ్ లో ఉండడాన్ని ఇష్టపడ్డానన్న సన్నీ  
  • అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చిందని వెల్లడి  
  • అభిమానుల వల్లే తాను ఇక్కడ ఉన్నట్టు వ్యాఖ్య  
Sunny Leone Some production houses and people still reluctant to work with me
ఒకప్పటి అడల్డ్ చిత్రాల నటి సన్నీ లియోన్.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి పదేళ్లు దాటిపోయింది. పాశ్చాత్య దేశాల్లో పోర్న్ చిత్రాల్లో నటించడానికి స్వస్తి చెప్పి.. 2012లో సన్నీలియోన్ బాలీవుడ్ పరిశ్రమలోకి రావడం ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. తొలి సినిమా జిస్మ్ 2. 

‘‘2012లో పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని. నేను మెరుగైన జీవితం గురించి ఆలోచించాను. ఇక్కడ ఉండడాన్ని ఇష్టపడ్డాను. ఈ పరిశ్రమ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రల విషయంలోనూ సంతోషంగానే ఉన్నాను. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయి. 

అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. ఇది నా ఇల్లే అని తెలుసుకున్నాను. నేను మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఈ స్థాయిలో పరిశ్రమను ప్రేమిస్తానని అనుకోలేదు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు. 

పరిశ్రమలోకి నేను అడుగు పెట్టినప్పుడు నాతో కలసి పనిచేయడానికి చాలా మంది వెనుకాడారు. కానీ, అదే సమయంలో నాతో నటిచేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు. అదే విధంగా పేరొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు సైతం ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి సంకోచిస్తున్నారు. కానీ, ఇదేమీ నన్ను బాధపెట్టదు. ఏదో ఒక రోజు వారితోనూ కలసి పనిచేసే అవకాశం వస్తుందని భావిస్తున్నాను ’’ అని 41 ఏళ్ల సన్నీ లియోన్ తన అంతరంగాన్ని బయటపెట్టింది.