నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాడలేము కదా..!: జాన్వీ కపూర్

18-08-2022 Thu 11:21
  • తనకు నచ్చినవాడిని మనువాడే స్వేచ్ఛ ఉందన్న జాన్వీ
  • అమ్మా, నాన్నకు అదే ఇష్టమని వెల్లడి
  • డేటింగ్ అంటే వారికి ఇష్టం లేదని స్పష్టీకరణ
Janhvi Kapoor says her parents wanted her to get married to any guy she likes
నటి శ్రీదేవి కుమార్తె, వర్ధమాన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి పెదవి విప్పింది. తన అమ్మ శ్రీదేవి, నాన్న బోనీ కపూర్ కు డేటింగ్ కాన్సెప్ట్ నచ్చదని, అదే సమయంలో తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలన్నది వారి అభిమతమని చెప్పింది. ప్రస్తుతం డేటింగ్ లేకుండా ఒంటరిగా సినిమాలపై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్.. పలు చిత్రాల్లో బిజీగా ఉంది. 

డేటింగ్ విషయంలో తన తల్లిదండ్రులది భిన్నమైన అభిప్రాయమని జాన్వీ చెప్పింది. ‘‘డేటింగ్ అన్నది ఓ సందర్భం. ఎందుకో తెలియదు కానీ, మామ్, డాడీ దీని విషయంలో ఎంతో నాటకీయంగా ఉంటారు. ‘నీవు ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే మా దగ్గరకు తీసుకురా, పెళ్లి చేస్తాం’ అన్నట్టు వారు ఉండేవారు. అయితే, నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాడలేము కదా. మనకు కొంచెం చిల్ కూడా ఉండాలి’’ అని జాన్వీ కపూర్ తెలిపింది. జాన్వీ కపూర్ లోగడ శిఖర్ పహారియాతో డేటింగ్ నడపడం తెలిసిందే. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జొహార్ కూడా బయటపెట్టారు.