మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు

18-08-2022 Thu 11:06
  • గత 24 గంటల్లో 12,608 పాజిటివ్ కేసులు
  • మొన్నటికంటే మూడు వేల కేసుల పెరుగుదల
  • ఒక్క రోజులోనే 72 మంది మృతి
India reports over 12000 fresh cases in last 24 hours
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రెండు రోజుల తర్వాత తిరిగి పదివేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 3.62 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 12,608 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొన్నటి కంటే దాదాపు మూడు వేల కేసులు పెరిగాయి. నిన్న ఒక్క రోజే కరోనా వల్ల 72 మంది చనిపోయారు. అదే సమయంలో 16,251 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  

ప్రస్తుతం దేశంలో 1,01,343 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.50 శాతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటిదాకా 208 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్కరోజే 38.64 లక్షల మంది టీకాలు తీసుకున్నారు.