'రాకెట్రీ' నష్టాలతో ఇంటిని అమ్ముకున్నారనే వార్తలపై మాధవన్ స్పందన

18-08-2022 Thu 09:47
  • ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా 'రాకెట్రీ' చిత్రం
  • తమ సినిమాకు గర్వపడే స్థాయిలో లాభాలు వచ్చాయన్న మాధవన్
  • ఇప్పటికీ తాను తన ఇంట్లోనేే ఉన్నానని స్పష్టీకరణ
R Madhavan response on news that he sold his house
ఇస్రో శాస్త్రవేత్త, క్రయోజెనిక్స్ డివిజన్ ఇన్చార్జిగా పని చేసిన పద్మభూషణ్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా 'రాకెట్రీ' సినిమాను మాధవన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నారాయణన్ పాత్రను ఆయనే పోషించారు. అయితే ఈ సినిమా వల్ల మాధవన్ నష్టపోయారని... అప్పులు తీర్చేందుకు ఇంటిని అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో మాధవన్ స్పందిస్తూ... ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాను తన ఇంటిని కానీ, మరేదాన్ని కానీ కోల్పోలేదని అన్నారు. మరో విషయం ఏమిటంటే... 'రాకెట్రీ' సినిమాలో భాగస్వాములు అయిన వారందరూ ఈ ఏడాది మరింత ఎక్కువ ఆదాయపు పన్ను కట్టబోతున్నారని చెప్పారు. దేవుడి దయవల్ల తామంతా కలిసి ఒక మంచి చిత్రాన్ని తీశామని... గర్వించే స్థాయిలో లాభాలను పొందామని తెలిపారు. తన ఇల్లు తనకు చాలా ఇష్టమని... ఇప్పటికీ ఆ ఇంట్లోనో ఉన్నానని చెప్పారు.