Balakrishna: ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు: బాలకృష్ణ

Balakrishna visits Hindupur constituency
  • హిందూపురం విచ్చేసిన బాలయ్య
  • నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటన
  • అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యలు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. సంపదను ఎలా సృష్టించాలో తెలియనివారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మిగులులోకి తెచ్చిన ఘనత టీడీపీదని వెల్లడించారు. బాలకృష్ణ రెండ్రోజుల పర్యటన కోసం సతీసమేతంగా హిందూపురం నియోజకవర్గానికి విచ్చేశారు. ఆయనకు తూముకుంట చెక్ పోస్టు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా బాలకృష్ణ చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అర్ధాంగి వసుంధరాదేవి కూడా పాల్గొన్నారు. లేపాక్షిలో బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Balakrishna
Hindupur
TDP
Andhra Pradesh

More Telugu News