Ravi Rai: బాలీవుడ్ మిమ్మల్ని ఎందుకు భరించలేదు?... దయచేసి మిమ్మల్ని డైరెక్ట్ చేసే భాగ్యాన్ని బాలీవుడ్ కు కల్పించండి: మహేశ్ బాబును కోరిన దర్శకుడు రవి రాయ్

Bollywood director Ravi Rai opines on Mahesh Babu comments
  • ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహేశ్ బాబు
  • బాలీవుడ్ తనను భరించలేదని వెల్లడి
  • అలాంటి స్థితిలో బాలీవుడ్ లేదన్న దర్శకుడు రవి రాయ్
  • దక్షిణాది దిగ్గజ నటులు బాలీవుడ్ లో నటించారని వెల్లడి
ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, "బాలీవుడ్ నన్ను భరించలేదు" అని బదులిచ్చారు. దీనిపై బాలీవుడ్ ఫిలింమేకర్ రవి రాయ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కరోనా సంక్షోభం తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోందని తెలిపారు. దీన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. 

"అయితే 'బ్రహ్మోత్సవం' స్టార్ మహేశ్ బాబు 'బాలీవుడ్ నన్ను భరించలేదు' అనే వ్యాఖ్యలను చేశారు. అలాంటి వ్యాఖ్యలు నిజమే అనిపించే స్థాయిలో బాలీవుడ్ దెబ్బతినలేదన్నది వాస్తవం. ఆ వ్యాఖ్యల పట్ల చింతించారో లేక, ఆ వ్యాఖ్యల పట్ల తప్పుగా ప్రచారం జరిగిందో తెలియదు కానీ... 'స్పైడర్' నటుడి(మహేశ్ బాబు)కి నేను సవినయంగా చేసుకునే విన్నపం ఏంటంటే... ఆయన దయచేసి బాలీవుడ్ కు వచ్చి తనను డైరెక్ట్ చేసే భాగ్యాన్ని కల్పించాలి. బాలీవుడ్ అతడిని ఎందుకు భరించలేదు? 'ఆగడు' నటుడు ఓసారి చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ వంటి నటులకు బాలీవుడ్ హార్దికస్వాగతం పలికింది" అంటూ రవి రాయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
Ravi Rai
Mahesh Babu
Bollywood
Tollywood

More Telugu News