Court Building: విజయవాడలో రూ.100 కోట్లతో కోర్టు భవనాలు... ప్రారంభించనున్న సీజేఐ ఎన్వీ రమణ

New court building being under construction in Vijayawada
  • విజయవాడలో కొత్త కోర్టు భవన సముదాయం
  • మొత్తం 29 కోర్టుల నిర్మాణం
  • ఇప్పటివరకు 6 అంతస్తులు పూర్తి

విజయవాడలో కొత్తగా నిర్మిస్తున్న కోర్టు భవనాలను ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. దీనిపై కలెక్టర్ ఢిల్లీ రావు స్పందించారు. ఈ నెల 20న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే 6 అంతస్తులు పూర్తయ్యాయని, మిగతావి కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు.

కాగా, కొత్త కోర్టు భవనాలపై బార్ అసోసియేషన్ వివరాలు తెలిపింది. కొత్త కోర్టు భవనాలను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. నూతన భవనంలో మొత్తం 29 కోర్టులు ఏర్పాటవుతున్నాయని వివరించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు సీజే, ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటారని తెలిపింది.

  • Loading...

More Telugu News