కాలాబత్తి, మైసూర్ మల్లిక... తన పొలంలో విభిన్న రకాల వరి పండిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- కొన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్న లక్ష్మీనారాయణ
- కాకినాడ జిల్లా ధర్మవరంలో పొలం కౌలుకు తీసుకున్న వైనం
- ప్రకృతి విధానంలో వ్యవసాయం
- వరినాట్లు పూర్తయ్యాయంటూ ట్విట్టర్ లో వెల్లడి
తాజాగా, తన పొలంలో వరినాట్లు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీనారాయణ పంచుకున్నారు. కాలాబత్తి, మైసూర్ మల్లిక రకం వరి పండిస్తున్నామని, దానికి సంబంధించి నాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వరినాట్లు సందర్భంగా సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
