'సీతారామం' సినిమాను మా కుటుంబం అంతా కలిసి చూశాం: సీఎం రమేశ్

17-08-2022 Wed 18:10
  • సినిమా అద్భుత విజయం సాధించిందన్న సీఎం రమేశ్
  • నిర్మాత అశ్వనీదత్ విభిన్న చిత్రాలు అందిస్తున్నారని కితాబు
  • ప్రియాంక, స్వప్న దత్ లకు శుభాకాంక్షలు
  • ఆగస్టు 5న రిలీజైన సీతారామం
  • దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా చిత్రం
CM Ramesh says he watched Sitaramam movie along with his family
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతారామం. ఆగస్టు 5న 'బింబిసార' చిత్రంతో పాటు రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ లభించింది. సీతారామం చిత్రాన్ని హాయిగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. 

తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా సీతారామం చిత్రంపై స్పందించారు. అద్భుత విజయం సాధించిన వైజయంతీ మూవీస్ వారి సీతారామం చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూడడం జరిగిందని వెల్లడించారు. వైజయంతి ఫిలింస్ ద్వారా విభిన్నమైన చిత్రాలు అందిస్తున్న నిర్మాత అశ్వినీదత్ గారికి, ప్రియాంక గారికి, స్వప్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ సీఎం రమేశ్ ట్వీట్ చేశారు.