Mammootty: మమ్ముట్టి.. సనత్ జయసూర్య ఒకేచోట చేరితే..!

Mammootty meets cricketer Sanath Jayasuriya in Sri Lanka during shoot for his next
  • షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లిన మమ్ముట్టి
  • కొలంబోలో స్వాగతం పలికిన జయసూర్య
  • షూటింగ్ ల కోసం శ్రీలంకకు రావాలని భారత నటులకు పిలుపు
ఒకరు నటనలో.. మరొకరు క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్న వారు. వారే మమ్ముట్టి, సనత్ జయసూర్య. మరి వీరిద్దరూ ఒక చోట చేరితే..? అదే దృశ్యం సాక్షాత్కారమైంది. సినిమా షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లిన బహుభాషా నటుడు మమ్ముట్టి, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను కొలంబోలో కలుసుకున్నారు. శ్రీలంక పర్యాటక విభాగం బ్రాండ్ అంబాసిడర్ గా జయసూర్య ఇటీవలే నియమితుడైన సంగతి విదితమే.  

కొలంబోలో మమ్ముట్టికి జయసూర్య సాదర స్వాగతం పలకడమే కాకుండా, ఆయనను అసలైన సూపర్ స్టార్ గా అభివర్ణించాడు. ఈ సందర్భంగా, భారత నటులు అందరూ షూటింగ్ ల కోసం శ్రీలంకకు రావాలని పులుపునిచ్చాడు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను జయసూర్య ట్విట్టర్ లో పంచుకున్నాడు. 

‘‘మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మమ్ముట్టిని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. సర్, మీరు అచ్చమైన సూపర్ స్టార్. శ్రీలంకకు వచ్చినందుకు ధన్యవాదాలు. మా దేశానికి వచ్చి అనుభూతి పొందాలని భారత్ కు చెందిన అందరు నటులు, స్నేహితులను కోరుతున్నాను’’ అని జయసూర్య ట్వీట్ చేశాడు. 

కడుగన్నవ ఒరు యాత్రాకురిప్ సినిమాలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఎంటీ వాసుదేవ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దీన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారు. 
Mammootty
Sanath Jayasuriya
Sri Lanka
colombo
meet

More Telugu News