WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ ను పెట్టిన వారికి తెలియకుండా చూడడం ఎలా..?

  • ఇందుకు రీడ్ రిసీప్ట్స్ ను ఆఫ్ చేసుకోవడం ఒక మార్గం
  • మొబైల్ డేటా ఆఫ్ చేసి చూడడం మరో ఆప్షన్
  • లేదంటే ఫోన్లోని ఫైల్ మేనేజర్ కు వెళ్లి కూడా చూడొచ్చు
  • ఇవన్నీ కొన్ని జాగ్రత్తల మేరకే చేయాలి..
How to view someones WhatsApp Status without letting them know

తమ వ్యక్తిగత, తమకు నచ్చిన విషయాలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాట్సాప్ స్టేటస్ ను చూడాలనుకునే వారు, పెట్టిన వారికి తాము చూసినట్టు తెలుస్తుందన్న ఉద్దేశ్యంతో కొందరు దూరంగా ఉండిపోతుంటారు. పెట్టిన వారికి తెలియకుండా వాట్సాప్ చూసే మార్గాలున్నాయి.

వాట్సాప్ స్టేటస్ పై క్లిక్ చేస్తే, పెట్టిన వారికి దాన్ని ఎవరెవరు చూశారన్నది అక్కడ హిస్టరీ కనిపిస్తుంది. ఈ హిస్టరీలోకి తాము చూసినట్టు నమోదు కాకుండా ఉండాలంటే.. రీడ్ రిసీప్ట్స్ ను డిసేబుల్ చేసుకోవాలి. లేదంటే తమ ఫోన్ లోని ఫైల్స్ లో స్టేటస్ ఫోల్డర్ కు వెళ్లి చూడాలి. 

వాట్సాప్ లో ఒకరి మెస్సేజ్ మనం చూసినట్టు ఎలా తెలుస్తుంది..? రెండు బ్లూ రంగు టిక్ మార్క్ లు కనిపిస్తాయి. దీన్ని ఆఫ్ చేసుకోవడం చాలా మందికి తెలుసు. దీన్ని ఆఫ్ చేస్తే, మనం పెట్టిన మెస్సేజ్ లను అవతలి వైపు వారు చూసినా, తెలియదు. ఇది నిబంధన. ఇదే మాదిరి స్టేటస్ చూసినట్టు తెలియకుండా చేసుకోవచ్చు. 

వాట్సాప్ ను ఓపెన్ చేసి, పై భాగంలో కుడి చేతి వైపు మూలన డాట్స్ దగ్గర క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ ను క్లిక్ చేయాలి. అందులో ప్రైవసీ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్న తర్వాత.. రీడ్ రిసీప్ట్స్ ను ఆఫ్ చేయాలి. 

మొబైల్ లో డేటాను ఆఫ్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ తెరిచి స్టేటస్ ను చూడొచ్చు. కాకపోతే మళ్లీ ఆన్ లైన్ లోకి వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తి చూసినట్టు స్టేటస్ పెట్టిన వారికి తెలుస్తుంది. కనుక స్టేటస్ ఎక్స్ పైరీ అవ్వడానికి ముందు మొబైల్ లో డేటా ఆఫ్ చేసి చూడడం ఒక మార్గం.

మరో మార్గంలో మొబైల్ ఫోన్లోని ఫైల్ మేనేజర్ ను తెరవాలి. మీడియా ఫోల్డర్ ను ఓపెన్ చేసి, స్టేటస్ ఎంపిక చేసుకోవాలి. వాట్సాప్ స్టేటస్ కింద పెట్టిన కాంటాక్ట్ జాబితాలోని వారి ఫొటోలు ఈ ఫోల్డర్ లోకి చేరతాయి. ఇది కనిపించకపోతే ఫైల్ మేనేజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, షో హిడెన్ ఫైల్స్ ను యాక్టివేట్ చేసుకోవాలి.

More Telugu News