Gulam Navi Azad: కాంగ్రెస్ కు షాకిచ్చిన గులాం నబీ అజాద్

Gulam Nabi Azad quits from key post
  • జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా అజాద్ నియామకం
  • గంటల వ్యవధిలోనే ఆ పదవికి రాజీనామా చేసిన అజాద్
  • పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా రాజీనామా చేసిన వైనం

కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ షాకిచ్చారు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానంపై అజాద్ గుర్రుగా ఉన్నారు. పార్టీ ట్రబుల్ షూటర్ గా ఉన్న ఆయన... పార్టీలో మార్పుల కోసం పట్టుబడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించిన కాసేపటికే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. 

జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా పార్టీ అధిష్ఠానం ఆయనను నియమించింది. అయితే, గంటల వ్యవధిలోనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు జమ్మూకశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ కు షాకిచ్చింది. 

ఆలిండియా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడైన తనను జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించడం పట్ల ఆయన అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నియామకాన్ని ఆయన డిమోషన్ గా భావించారని చెపుతున్నారు. పార్టీలో తన హోదాను తగ్గించారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అందుకే బాధ్యతలను అప్పగించిన కాసేపటికే ఆయన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల వల్లే తాను రిజైన్ చేస్తున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News