తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో చిరుతపులి సంచారం

16-08-2022 Tue 21:53
  • అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చిరుత
  • కుక్కలపై దాడికి ప్రయత్నం 
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
  • అప్రమత్తమైన వర్సిటీ అధికారులు 
Leopard spotted at Tirupati SV Veterinary University campus
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్ లో చిరుతపులి సంచరిస్తోంది. వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆవరణలో చిరుత సంచరించినట్టు గుర్తించారు. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించింది. కుక్కలపై చిరుత దాడి దృశ్యాలు వర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చిరుతపులి సంచారం నేపథ్యంలో వర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. గతేడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.