తెలంగాణలో తాజాగా 406 కరోనా కేసులు

16-08-2022 Tue 21:16
  • గత 24 గంటల్లో 27,348 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 177 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 494 మంది
  • ఇంకా 3,095 మందికి చికిత్స
Telangana state corona update
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 27,348 శాంపిల్స్ పరీక్షించగా, 406 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 177, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 581 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,667 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,095 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.