అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న 'దృశ్యం 3' పోస్టర్!

16-08-2022 Tue 19:43
  • మలయాళంలో రూపొందిన 'దృశ్యం' .. 'దృశ్యం 2'
  • ఇతర భాషల్లోని రీమేకులకు విశేషమైన ఆదరణ  
  • 'దృశ్యం 3' సినిమా నుంచి వదిలిన పోస్టర్
  • ఆ సినిమా రిజల్ట్ ను బట్టి  తెలుగు సీక్వెల్
Drushyam 3 Movie Update
మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. తెలుగుతో పాటు రీమేక్ అయిన ఇతర భాషల్లోను ఈ సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఫస్టు పార్టుకి మించి సెకండు పార్టుకి రెస్పాన్స్ రావడం విశేషం. 
 
ఈ నేపథ్యంలో జీతూ జోసెఫ్ ఈ సినిమా 3వ భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మోహన్ లాల్ పోస్టర్ ను వదిలారు. మోహన్ లాల్ కి సంకెళ్లు వేసి ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సిరీస్ ఈ సినిమాతో ముగుస్తుందని జీతూ చెప్పడంతో, ముగింపు పట్ల అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.

జీతూ చాలా వేగంగా కథాకథనాలు రెడీ చేస్తుండటం, చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ రోజుల్లో తెరపైకి తీసుకుని వస్తుండటం విశేషం. మలయాళంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూసుకుని, తెలుగు రీమేక్ గురించిన ఆలోచన చేయవచ్చనే ఉద్దేశంతో వెంకటేశ్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.