జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా: నారా లోకేశ్

16-08-2022 Tue 19:39
  • సీఎం జగన్ లక్ష్యంగా లోకేశ్ వ్యాఖ్యలు
  • జగన్ వన్నీ పదోతరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలని విమర్శలు
  • వచ్చిన పరిశ్రమల కంటే పోయినవే ఎక్కువని వెల్లడి
  • శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని స్పష్టీకరణ
Nara Lokesh sensational comments on CM Jagan
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటన చేశారు. జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతానని తెలిపారు. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి ఢిల్లీలో తలవంచారని విమర్శించారు. జగన్ వన్నీ పదో తరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు అని పేర్కొన్నారు. 

వైసీపీ హయాంలో వచ్చినవాటి కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతనేది చర్చకు వస్తోందని ఆరోపించారు. వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని లోకేశ్ ప్రకటించారు.