చిరూ బర్త్ డేకి భారీ సందడి!

16-08-2022 Tue 18:27
  • ఈ నెల 22వ తేదీన చిరూ బర్త్ డే
  • 'గాడ్ ఫాదర్' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 
  • అదే బాటలో 'వాల్తేర్ వీరయ్య' సందడి 
  • లైన్లోనే ఉన్న మెహర్ 'భోళా శంకర్'
Chiranjeevi Movies Update
ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు. ఆ రోజున సోషల్ మీడియాలో సందడి ఒక రేంజ్ లో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా సమాచారం. ఆయన నటిస్తున్న మూడు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ముందుగా 'గాడ్ ఫాదర్' విడుదలకు ముస్తాబవుతోంది. 

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. చిరూ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆ రోజున ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఉండనుందని అంటున్నారు. మోహన్ రాజా అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. 

ఇక బాబీ సినిమా 'వాల్తేర్ వీరయ్య' సినిమా షూటింగు దశలోనే ఉంది. ఈ సినిమా నుంచి కూడా అప్ డేట్ ఇవ్వడానికి బాబీ కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. మెహర్ రమేశ్ కూడా 'భోళా శంకర్'పై అంచనాలు పెరిగేలా అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ మూడు సినిమాల అప్ డేట్స్ తో ఆ రోజున సందడి నెక్స్ట్ లెవెల్లో ఉండనుందన్న మాట.