'కార్తికేయ 2'కి కలిసొచ్చింది అదే!

16-08-2022 Tue 17:33
  • ఈ నెల 13న విడుదలైన 'కార్తికేయ 2'
  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న థియేటర్లు 
  • ఓవర్సీస్ లో పుంజుకున్న వసూళ్లు 
  • ఈ వారంలోను ఈ సినిమాదే హవా
Karthikeya 2 movie update
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి తక్కువ థియేటర్లు దొరికాయి. ఖర్చుపరంగా .. విజువల్స్ పరంగా ఈ సినిమాకి ఎక్కువ మార్కులు పడినప్పటికీ, కంటెంట్ పరంగా ఫస్టు పార్టు బాగుందనే టాక్ వచ్చింది. 

అయితే ఈ సినిమాకంటే ఒకరోజు ముందుగా విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా మెప్పించలేకపోయింది. ఆడియన్స్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోవడం .. దగ్గరలో పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశంగా మారింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇప్పుడు ఎక్కువ థియేటర్లు దొరుకుతూ ఉండగా .. ఓవర్సీస్ లో వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ సినిమా 3 రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టిందని అంటున్నారు. ఈ వారంలో చెప్పుకోదగిన సినిమాలేవీ బరిలోకి దిగడం లేదు కాబట్టి, ఈ సినిమా భారీ లాభాలను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.