మత్స్యకారుడినైన నా ఇంటికి సీఎం జగన్ రావడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

16-08-2022 Tue 16:40
  • ఇటీవల జరిగిన వాసుపల్లి గణేశ్ కుమారుడి వివాహం
  • వాతావరణం అనుకూలించక రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన జగన్
  • ఈరోజు నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
Jagan went to Vasupalli Ganesh home
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఇంటికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. ఇటీవల వాసుపల్లి గణేశ్ కుమారుడు సూర్య, రాశిల వివాహం జరిగింది. వీరి రిసెప్షన్ కు సీఎం రావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆయన రాలేకపోయారు. ఈ రోజు విశాఖ పర్యటనలో ఉన్న జగన్... గణేశ్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

అనంతరం వాసుపల్లి గణేశ్ మాట్లాడుతూ, జగన్ తమ ఇంటికి రావడంతో తమ జీవితం ధన్యమయిందని చెప్పారు. మత్స్యకారుడినైన తన ఇంటికి జగన్ రావడం సంతోషకరమని అన్నారు. ఈరోజును తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారని అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రిసెస్షన్ కు ముఖ్యమంత్రి రాలేకపోయారని చెప్పారు.