కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం... చిన్నారి సహా ఐదుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం

15-08-2022 Mon 21:07
  • బీదర్ జిల్లాలో రహదారి రక్తదాహం
  • హైదరాబాద్ నుంచి గంగాపూర్ వెళుతున్న కుటుంబం
  • కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొన్న కారు
  • మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
  • దత్తాత్రేయ ఆలయ సందర్శనకు వెళుతుండగా ఘటన
Hyderabadis dies in road mishap in Karnataka
కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాదు బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ ను వెనుకనుంచి ఢీకొన్నది.