ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు!

15-08-2022 Mon 20:22
  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • రాజ్ భవన్ లో ఎట్ హోమ్
  • తేనీటి విందు ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
  • చివరి నిమిషంలో ఎట్ హోమ్ కు కేసీఆర్ దూరం
CM KCR keeps distance to At Home
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిన సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ఆయన ఎట్ హోమ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 

వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి సమాచారం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరం కాగా, సీఎస్ సోమేశ్ కుమార్, మరికొందరు ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున ఎట్ హోమ్ లో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో కనిపించలేదు.