'ఎట్ హోమ్' లో చంద్రబాబు బృందం... సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన టీడీపీ!

15-08-2022 Mon 19:21
  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • ఏపీ రాజ్ భవన్ లో తేనీటి విందు
  • టీడీపీ నేతలకు ఆహ్వానం
  • సాదరంగా స్వాగతం పలికిన గవర్నర్
Chandrababu and other TDP leaders attends At Home in Raj Bhavan
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

టీడీపీ బృందానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాదరంగా స్వాగతించారు. టీడీపీ నేతలంతా ఒకే టేబుల్ వద్ద ఆసీనులయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.