నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్

15-08-2022 Mon 18:36
  • ఈ నెల 13న విడుదలైన 'కార్తికేయ 2'
  • జోరు తగ్గని ప్రమోషన్స్
  • ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారన్న నిఖిల్ 
  • చందమామ కథలా అనిపిస్తుందంటూ వ్యాఖ్య   
Karthikeya 2 movie team interview
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ 2' సినిమా ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఒక వైపున ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉన్నప్పటికీ, ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను ఆపడం లేదు. తాజా ఇంటర్వ్యూకి దర్శక నిర్మాతలతో పాటు, నిఖిల్ - అనుపమ కూడా హాజరయ్యారు. 

నిఖిల్ మాట్లాడుతూ .. 'కార్తికేయ 2' కంటెంట్ పై మాకు నమ్మకం ఉంది .. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన చాలా టెన్షన్ పడ్డాము. జనాలు థియేటర్లకు వస్తారా .. చూస్తారా? ఇలా ఎన్నో ఆలోచనలు. సినిమాకి సక్సెస్ టాక్ వచ్చిన తరువాత మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశం" అన్నాడు. 

"గతంలో పిల్లలకు అమ్మమ్మలు .. నాన్నమ్మలు చందమామ కథలు చెప్పేవారు. పిల్లలు వాటిని ఎంతో శ్రద్ధగా వినేవారు. అలా ఒక చందమామ కథ మాదిరిగానే ఈ సినిమాను చూపించాము. రవితేజ .. రామ్ .. ఇలా చాలామంది ఈ సినిమా చూసి ట్వీట్స్ పెడుతూ ఉండటం, మా అందరికీ మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.